February 22, 2026

రంగారెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష స్థానం కోసం దేప భాస్కర్ రెడ్డి పేరు ముందంజలో

0
IMG-20251017-WA1033

కాపు అక్టోబర్ 17 మహేశ్వరం: గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి) అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం,పార్టీ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించానని,అనేక మంది కార్యకర్తలను పార్టీ పట్ల కట్టుబాటుగా ఉంచానని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి తన పేరును 1వ నంబర్‌లో రాయవలసిందిగా పార్టీ నాయకులను అభ్యర్థించారు.ఈ మేరకు ఆయన 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా జరుగనున్న సమావేశంలో పాల్గొననున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed