February 22, 2026

యువకులంతా ఒక్కటై. తమ స్వంత ఖర్చులతో పాఠశాలకు రంగుల కల తెచ్చే హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు “పలువురి మన్ననలు పొందుతున్న తాళ్లఖమ్మంపహడ్ గ్రామ యువత”

0
IMG-20260217-WA1523

ఫిబ్రవరి 17 సూర్యాపేట రూరల్: జన్మనిచ్చిన తల్లి,అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడి గా మార్చిన గ్రామం, ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో స్థిర స్థాయిగా నిలిచిపోతాయి. దీనిలో తమకు అక్షర జ్ఞానాన్ని అందించిన ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయుటకు పూనుకున్నారు… సూర్యాపేట మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహడ్ గ్రామానికి చెందిన యువకులు. సమాజ సేవకులుగా మారి గ్రామంలోని దేవిరెడ్డి రాంరెడ్డి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి బాటలు వేశారు. పేద పిల్లలు చదివే పాఠశాలను మరింత అభివృద్ధి చేయుటకు చేయి చేయి కలిపి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. “సుమారు రెండు లక్షల వ్యయంతో” గ్రామంలోని 20 మంది యువకులు ఏకమై స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పెయింటింగ్ వేయించేందుకు గాను తమ వంతుగా తలా కొంత డబ్బులు జమ చేసి సుమారు రెండు లక్షల వ్యయంతో తరగతి గదులతో పాటు, పాఠశాల భవనానికి అందమైన రంగులను వేయించారు. పాఠశాలకు రంగులు వేయించడంతో పాటు తరగతి గదులపై విద్యార్థులకు ఉపయోగపడే రకరకాల అందమైన బొమ్మలను వేయించారు. “అందరి మన్ననలు పొందుతున్న యువత” చేతిలో రూపాయి ఉంటే ఎన్నో వ్యసనాలకు నేటి యువత బానిస అవుతుంటే అందుకు విభిన్నంగా నిలిచారు. తాళ్లఖమ్మంపహడ్ గ్రామానికి చెందిన యువత. ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలోని ఉన్నత పాఠశాలకు పెయింటింగ్ వేయకపోవడంతో పాఠశాల భవనం, తరగతి గదులు అద్వానంగా తయారయ్యాయి. క్రమంలో గ్రామానికి చెందిన యువకులు ఏకమై తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నత పాఠశాల తరగతి గదులతో పాటు పాఠశాల భవనానికి పెయింటింగ్ వేయించడంతో పాఠశాల భవనం ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ పాఠశాలను రంగుల మయంగా మార్చడంతో యువతను గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. “గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు సైతం” గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు. పెయింటింగ్ వేయించడంతో పాఠశాల భవనం నూతన కళ సంతరించుకుంది. దీంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు, ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాథమిక పాఠశాలకు సైతం పెయింటింగ్ వేయించి అందంగా తీర్చిదిద్దేందుకు యువత ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గ్రామ యువత తీసుకుంటున్న నిర్ణయాల పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ యువతను శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed