యలమంచి ఉదయ్ కిరణ్‌పై స్ఫూర్తిదాయక గీతాల ఘన ఆవిష్కరణ
జనవరి 29 శేరిలింగంపల్లి: “ఉదయించే సూర్యుడు మన ఉదయ్ కిరణ్ అన్న రా… రేవంత్ అన్న, జగదీశ్ అన్న అండగా ఉండేరా” మరియు “నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం మన అన్న ఉదయ్ కిరణ్” అనే స్ఫూర్తిదాయక గీతాలను ప్రజాసేవకు అంకితమైన యువ నాయకుడు శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ పై రూపొందించగా, వాటిని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ & టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఘనంగా ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ యువ నాయకుడు, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అయిన యలమంచి ఉదయ్ కిరణ్ గారి సేవా నిబద్ధత, నాయకత్వ ప్రతిభ, ప్రజల పట్ల అంకితభావాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాలు రూపొందించబడ్డాయి. ఈ పాటలను టీమ్ యలమంచి ఉదయ్ కిరణ్ మరియు గోకినేపల్లి రమేష్ గారు జన్మదిన సందర్భంగా ప్రేమతో అంకితం చేశారు. హన్మకొండకు చెందిన ప్రముఖ రచయిత శ్రీకాంత్ గారు రచించిన ఈ గీతాలు యువతలో చైతన్యం నింపేలా, నాయకత్వ విలువలను ప్రతిఫలించేలా రూపుదిద్దుకున్నాయి. “యలమంచి ఉదయ్ కిరణ్ గారి విశేష సేవా కార్యక్రమాలు” సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, జియోమెట్రీ బాక్సుల పంపిణీ, వృద్ధాశ్రమాలు–అనాథాశ్రమాలకు అన్నదానం, ఫలాల పంపిణీ, వికలాంగులకు సహాయక పరికరాల అందజేత, ఉచిత మెడికల్ క్యాంపులు, కంటి పరీక్షలు, మందుల పంపిణీ, GHMC కార్మికులకు అన్నదాన కార్యక్రమాలు, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం, యువత కోసం స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, పోటీలు నిర్వహణ, పేద విద్యార్థులకు ఫీజు సహాయం, గ్రేస్ ఆర్ఫనేజ్‌కు అన్నదానం వంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. “రాజకీయ రంగంలో చురుకైన ప్రజాసేవ” కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నారు. గణతంత్ర వేడుకలు, రైతు రుణమాఫీ వార్షికోత్సవాలు, సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, కార్యకర్తల సన్మానాలు, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలపై చర్యలు, దేవాలయ కార్యక్రమాలు, వినాయక మండపాల సందర్శనలు, అన్నదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. “ముఖ్య అతిథుల ప్రశంసలు” పాటల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు యలమంచి ఉదయ్ కిరణ్ యువతకు ఆదర్శప్రాయ నాయకుడని, ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తిత్వమున్న నాయకుడిగా ప్రశంసించారు. ఆయన నాయకత్వం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎకనమికల్ వికర్ సెక్షన్ వైస్ ప్రెసిడెంట్ మరియు శేరిలింగంపల్లి ప్రెసిడెంట్ వినోద్ రావు గారు,జి వి రెడ్డి,యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,టీమ్ యలమంచితో పాటు రాచమల్ల భాస్కర్ గౌడ్,బండి రామకృష్ణ,రాధాకృష్ణ,గోకినేపల్లి రమేష్,కామినేని శ్రీనివాసు, రత్నాచారి,సతీష్,నాగ సాయి,బొబ్బా సాయి తదితరులు పాల్గొన్నారు..