మైలార్ దేవ్ పల్లి పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు 2000-2001 పదవ తరగతి బ్యాచ్
డిసెంబర్ 28 మైలార్ దేవ్ పల్లి: మైలార్ దేవ్ పల్లి 2000-2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి. 2000-2001 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి గెట్ టుగెదర్ నిర్వహించుకుని తమ తమ మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. తమకు పాఠాలు నేర్పిన ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను స్వాగతించి వారికి ఘనంగా శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. చిన్ననాటి నుండి చేసిన అల్లర్లు తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అందరూ తమ తమ పరిచయాలు చేసుకున్నారు. కార్యక్రమానంతరం భోజనాలు స్వీకరించి వాళ్ల వాళ్ల పరిచయాలు చేసుకున్నారు పూర్వపు 2000 – 2001లో పదో తరగతి విద్యార్థులు.