February 22, 2026

మాజీ విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి చేతులు మీదుగా ‘మన ఊరి న్యూస్’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

0
IMG-20260110-WA0955

హైదరాబాద్, జనవరి 10: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మన ఊరి న్యూస్’ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజానికి నిజాయితీ, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను అందిస్తూ ‘మన ఊరి న్యూస్’ తెలుగు దినపత్రిక అద్భుతమైన సర్కులేషన్ తో ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య
మనుగడకు, సమాజాభివృద్ధికి వార్తాపత్రికల పాత్ర అపారమైనదని, బడుగు, బలహీన, పీడిత వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేయాలని సూచించారు. ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా సమాచారం, విశ్లేషణలతో సమాజాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరి న్యూస్’ కృషి చేయాలని ఆకాంక్షించారు. ‘మన ఊరి న్యూస్’ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎడిటర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, పత్రిక యొక్క దృక్పథం, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ప్రారంభ సంవత్సరం లోనే ఐదు లక్షల డిజిటల్ సర్కులేషన్ సాధించినట్టు తెలిపారు. అతి త్వరలో ఒక మిలియన్ మైలురాయిని దాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా మని, పాఠకులు, శ్రేయోభిలాషుల సహకారంతో దీన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూత్ అధ్యక్షుడు అక్యం రాఘవేందర్ యాదవ్, మంచెర్ల చిరంజీవి, మైస్ రెడ్డి, గాజుల నరేష్ యాదవ్, కృష్ణ ముదిరాజ్. పవన్ గుప్తా, నాగరాజ్, రాజు, శేఖర్, డి.రమేష్ ముదిరాజ్, కే.వాసు బాబు కే.బాలకృష్ణ, జి లోకేష్,పి. మహేశ్వర్,ఎస్.మహేందర్ కార్తికేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed