బిసి బంద్ ను విజయవంతం చేయండి: పెండ్యాల సాయి మల్లిక్ రంగా రెడ్డి జిల్లా బి.సి ఉద్యోగులు సంఘం నాయకుడు మరియు WWEయూనియన్ 2873 చీఫ్ వైస్ ప్రెసిడెంట్
అక్టోబర్ 17 రాజేంద్రనగర్:తెలంగాణ రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోర్టు స్టే ఇచ్చిన సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అడ్డు తగులుతున్న కొంతమందికి బుద్ధి వచ్చేలాగా తెలంగాణలో ఉన్న బీసీ సంఘాల జేఏసీ అక్టోబర్ 18 తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. కావున వారి పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఓబీసీ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న వారందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపవలసిందిగా మనవి చేయడం జరుగుతుంది.పెండ్యాల సాయి మల్లిక్ (రంగా రెడ్డి జిల్లా బి.సి ఉద్యోగులు సంఘం నాయకుడు మరియు WWEయూనియన్ 2873 చీఫ్ వైస్ ప్రెసిడెంట్). 42 శాతం జస్టిస్ ఫర్ తెలంగాణ బంద్ విజయవంతం చేయాలి