ప్రస్తుత బీహార్, ఝార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముండా తెగ ఆదివాసి ఉద్యమానికి నాయకత్వం వహించిన బిర్సా ముండా
సెప్టెంబర్ 26 హైదరాబాద్: ప్రస్తుత బీహార్, ఝార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముండా తెగ ఆదివాసి ఉద్యమానికి నాయకత్వం వహించిన బిర్సా ముండా
( 1875-1900) ను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసిన సందర్భం.
ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్న బిర్సా 22 ఎలా వయసులోనే తిరుగుబాటు ఉద్యమంలో చేరారు.1895 లో తొలిసారిగా అరెస్టయి, రెండేళ్లు జైల్లో ఉన్నారు.1900 ఫిబ్రవరి 3న మరోసారి అరెస్టై, జైల్లో బ్రిటిష్ పోలీసుల విష ప్రయోగం వల్ల చనిపోయారు. కేవలం పాతికేళ్ల జీవితం మాత్రమే!
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫోటో పెట్టి, కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ గౌరవం పొందిన ఏకైక ఆదివాసి నాయకుడు అతడు మాత్రమే. ఆయన జయంతిని జాతీయ గౌరవ దివస్ గా కూడా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాంచి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు. ఢిల్లీలో ఒక జంక్షన్ కు కూడా ఆయన పేరు ఉంది.
ఆయన స్ఫూర్తి ఉందో, లేదో తెలియదు గానీ, ఆయన మరణం తరువాతే విశాఖ ఏజెన్సీలో అల్లూరి, సాలూరు ఏజెన్సీలో ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాయకత్వంలో ఆదివాసి తిరుగుబాట్లు జరిగాయి. వాటి స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజా ఉద్యమాలు హక్కుల కోసం ప్రశ్నిస్తున్నాయి.