ప్రతిభ సేవ పురస్కారం అందుకున్న సామాజికవేత్త డాక్టర్ మల్లెపూల వెంకటరమణ
అక్టోబర్ 16 హైదరాబాద్:హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ పి ల్డర్ మాత ఫౌండేషన్ న్యూఢిల్లీ అమృత శ్రీ వర్షిని కల్చరల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ సిటి కల్చరల్ సాంస్కృతిక ఆర్గనైజేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు కాకుమాను జ్యోతి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుండి విచ్చేసిన సంఘసంస్కర్తలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటున్న గాయని గాయకులు ముఖ్య అతిథులు శ్రీ ఒకలాభరణం కృష్ణమోహన్ సినీ ప్రొడ్యూసర్ మురళీధర్ మరియు డాక్టర్ స్వరకిరిటీ కొండలరావు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మానవ హక్కుల సంఘాల నుండి పెద్ద ఎత్తున విచ్చేసిన మహిళా మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజంలో అనాధలను అభాగ్యులను ఏ విధంగా ఆదుకోవాలి వారికి మనము ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి అనే అంశంపై రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి అమ్మ అనాధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ సంఘ సేవకులు డాక్టర్ మల్లెపూల వెంకటరమణ హాజరైనారు వారు మాట్లాడుతూ సమాజంలో తమవంతుగా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో 100 రోజులు నాగోల్ విశాలాంధ్ర ఎదురుగాచలివేంద్రంఏర్పాటు చేయటం ఎంతమందికి దాహార్తిని తీర్చేందుకు తమ వంతు కళాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు మెడికల్ క్యాంపుల ద్వారా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అలాగే జ్యోతి గారు వారి సంస్థ నుండి ఎంతోమందికి గాంధీ ఆస్పత్రి ఏరియాలో ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు పేదవారికి ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది కొండలరావు గారు కాచిగూడ ఏరియాలో వృద్ధులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం వారు మానవత్వాన్ని చాటుకున్నారు అలాగే ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎన్నో రకాలుగా సేవలందించి గుర్తింపు పొంది ఈరోజు వారు ప్రతిభ సేవ పురస్కారములు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు అలాగే గాయని గాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు విచ్చేసిన అతిధులకు శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి రామోజీ బిజెపి జాతీయ నాయకులు వారు మాట్లాడుతూ జ్యోతి గారు గత కరోనా సమయము నుండి ఎంతోమందికి భోజన వసతులు మరియు దుస్తులు ఎన్నో రకాలుగా సేవలందించి సమాజంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా ఉంటూ ఆమె మార్గదర్శం ప్రతి ఒక్కరికి బాటకావాలని సమాజంలో ప్రతి ఒక్కరు ఎంతో కొంత పేదవారికి సహాయ సహకారాలు అందించాలని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు మరియు ఈనాడు పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు మరియు మిగతా స్వచ్ఛంద సంస్థ అధినేతలు మాట్లాడుతూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన జ్యోతి కి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వినోదం కోసం కొండలరావు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్యోతి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.