పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి:నగర పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్
హైదరాబాద్ అక్టోబర్ 18: పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ సూచించారు. సెంట్రల్ పీస్ కమిటీ ఈస్ట్ జోన్ అధ్యక్షుడు ఎస్. నారాయణరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. శరత్ శ్యామ్, మున్నా నాయక్ లు శనివారం విసి సజ్జనార్ ను కలిసి పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పీస్ కమిటీ ప్రతినిధులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.