నేటి నుంచి కిచెన్నగారి లక్ష్మారెడ్డి (KLR) మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పల్లెబాట.6 గ్యారెంటీలు సహా ప్రభుత్వ పథకాలపై ప్రచారం
మహేశ్వరం నవంబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పల్లెబాట పట్టారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.
👍 ఇందిరమ్మ ఇళ్లపై ప్రచారం ఇవాళ తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లను సందర్శించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కావటంతో తొలుత గ్రామస్థాయి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంచుకున్నారు KLR.
👉🏾కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తోంది. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పల్లెబాటు పట్టారు కిచ్చెన్న. విపక్షాలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు జనంబాటను ఎంచుకున్నారు లక్ష్మారెడ్డి.
రోజూ ఒక సంక్షేమ పథకాన్ని ఎంచుకుని ఆయా లబ్దిదారులను కలిసేందుకు కార్యాచరణ రూపొందించారు.