దుర్గామాత పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ఆకర్షణ
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత ప్రతిష్టా పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి,మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి వారికి గ్రామ పెద్దలు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ:-గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని పెంచుతాయి,యువత సంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగాలి అని అన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.