జులై 4న జరగబోయే మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
జూన్ 30 హైదరాబాద్: జులై 4న జరగబోయే మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఎల్బిస్టేడియం ను పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్,విహెచ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి..జూలై 4 వ తేదీ ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానుండడంతో సభ ఏర్పాట్లు పరిశీలించిన నేతలు.సభ కు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు,స్టేజి, పార్కింగ్, వీఐపీ ఎంట్రన్స్ తదితర వాటిని పరిశీలించిన పీసీసీ, మంత్రులు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్, సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు నారికేల్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు.