జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
సెప్టెంబర్ 16 హైదరాబాద్: జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పేద, మధ్యతరగతి, రైతాంగ కుటుంబాల మేలు కోసం ప్రజా ప్రభుత్వం ఈ విధాన నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు ఆయన పేర్కొన్నారు. సవరించిన రేట్లతో కోట్లాదిమందికి ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
తగ్గిన ధరలను ప్రజలకు చేరేలా వ్యాపారులు తమ దుకాణాల ముందు స్పష్టంగా ప్రదర్శించాలని ఆయన సూచించారు. వ్యవసాయ పరికరాలు, ఆహార ఉత్పత్తులు, సిమెంట్ ధరలు తగ్గడం వల్ల సాధారణ కుటుంబాలకు, నిర్మాణ రంగానికి, అర్బనైజేషన్ అభివృద్ధికి ఊతమిస్తుందని వివరించారు.
ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ ఆ ఫలాలు ప్రజలకు చేరాలంటే వ్యాపారులు భాగస్వాములుగా మారాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని భరోసా ఇచ్చారు.