చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో దేప భాస్కర్ రెడ్డి
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 26:తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు,వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆర్.కె. పురం డివిజన్లోని బాబు జగ్జీవన్ రావ్ ( బి జె ఆర్) భవన్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ:-వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాటంలో వీరవనిత ఐలమ్మ స్ఫూర్తి మరువలేనిది,చాకలి ఐలమ్మ లాంటి నిస్వార్థ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు.ఈ వేడుకల్లో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పూన్న గణేష్ నేత,చిలుక ఉపేందర్ రెడ్డి,గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు,బొడ్డుపల్లి మహేందర్,జ్ఞానేశ్వర్ యాదవ్,పగడాల శ్రీశైలం,రామకృష్ణ గౌడ్,బొడ్డుపల్లి నగేష్,అంజి,డల్లి,నర్సింహ చారి,కిట్టు,అనీల్ సహా రాష్ట్ర నాయకులు,డివిజన్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.