February 22, 2026

“గెలిచే అభ్యర్థుల కోసం శోధన” అభ్యర్థి బలం, బలహీనతలపై పరిశోధన.! గెలుపు గుర్రాల కోసం *సర్వేలు..రి సర్వేలు.! *సెర్చ్ లు…రీసెర్చ్ లు:గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

0
IMG_20260131_150221

జనవరి 31 హైదరాబాద్:ఏదైనా ఒక విషయంలో తప్పకుండా విజయం సాధించాలంటే అందుకుగాను పలు రకాలుగా సర్వేలు, రిసర్వేలు, చర్చలు, సెర్చ్, రీసెర్చ్ శాస్త్రీయ పద్ధతిలో తప్పకుండా అవసరం. శోధించి శోధించి, పరిశోధించి గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసుకోవడంలోనే ఆయా పార్టీలో అసలైన విజయం కు పునాదిగా చెప్పవచ్చు. ఆయా ప్రాంతాలలో ఆయా పార్టీలకు ఎంత పట్టు ఉన్నప్పటికీ కరెక్ట్ అభ్యర్థిని బరిలో నిలవకపోతే విజయతీరాలకు చేరుకోవడం కష్టం కావచ్చు. ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలకు ఒక్కోసారి బలం బలహీనంగా ఉన్నప్పటికీ తెలివైన అభ్యర్థి ని ఎంపిక చేయడం ద్వారా గెలుపు నల్లేరుపై నడకలా సాగుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు సరైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టాయి. అందుకుగాను తమ పార్టీ తరఫున పోటీ చేసే ప్రాంతాలలో నమ్మకం ఉన్నవారితో సర్వే చేయించడం, థర్డ్ పార్టీ సర్వే చేయించడం, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించడం, జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం, వార్డులలో అభిప్రాయ సేకరణ, అభ్యర్థి బలం, బలగం, బలహీనతల గురించి తెలుసుకోవడం, ఏమైనా లోసుగులు ఉంటే వెంటనే పరిష్కరించడం, పోటీలో నిల్చునే అభ్యర్థి విషయంలో ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే స్వీకరించి విచారణ చేపట్టడం ఇలా పలు రకాలుగా పార్టీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా రీసెర్చ్ జరిపి గెలుపు గుర్రాల కోసం శాస్త్రీయ పద్ధతిని అవలంబిస్తున్నారు. సరైన అభ్యర్థి కోసం వేట…! సరైనోడు అయితేనే దక్కుతుంది విజయ బావుటా…!!
తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థుల కోసం అన్ని రాజకీయ పార్టీలు ‘వేట’ ప్రారంభించాయి. శుక్రవారం నామినేషన్లు ముగియడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థుల నుండి తమ తమ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలపడానికి ఎవరిని ఎంపిక చేద్దాం అన్న చర్యలు, చర్చలు జోరుగా చేపడుతున్నారు. శనివారం ఉదయం 11 గంటలకల్లా నామినేషన్ల స్కూటీని అనంతరం అర్హులైన నామినేషన్ల జాబితాను వెంటనే ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 1 ఆదివారం అప్పీల్ చేయవచ్చు. అప్పీల్ చేసుకున్న నామినేషన్లను ఫిబ్రవరి రెండో తారీకు సోమవారం పరిష్కరిస్తారు. తదుపరి ఫిబ్రవరి మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల్లోగా అభ్యర్థుల విరమణ ఉంటుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల విరమణ అనంతరం మూడు గంటల తర్వాత పోటీలో అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ఉండడంతో అర్హులైన నామినేషన్లు వేసిన అభ్యర్థుల నుంచి తమ తమ పార్టీల తరఫున పోటీలో నిలపాలనుకుంటున్న, నిర్ణయించిన అభ్యర్థుల విషయంలో గెలుపోటములపై నిర్ణయించి ఎంపిక చేయనున్నారు. అయితే పోటి నుంచి విరమణ చేసుకునే సమయం కంటే ముందుగానే అంటే దాదాపు నాలుగు రోజుల సమయం ఉంటున్నందున టికెట్ల కోసం వస్తున్న వారి విషయంలో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సరైన అభ్యర్థిని నిర్ణయించు…గెలుపు గుర్రం ఎక్కించు…!!ఎన్నికల్లో విజయానికి పునాది సరైన అభ్యర్థి ఎంపిక అనేది అందరూ అంగీకరించే నగ్న సత్యం. సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తే సగం విజయం సాధించినట్లే అన్న నానుడి మనందరికీ తెలిసిందే. అభ్యర్థి సరైనోడు అయితే మిగతా విషయాలన్నింటినీ దాదాపుగా చక్క పెట్టుకు రావచ్చు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు పకడ్బందీగా, పక్కా ప్రణాళికలతో సర్వే చేయించడం, సరైన ఫలితాలు అస్పష్టంగా ఉంటే మరోసారి రీ సర్వే చేయడం చేస్తున్నాయి. మేయర్లు, చైర్మన్ ల పీటం దక్కించుకోవడానికి ఆయా వార్డులలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో గెలవడం తప్పనిసరి కావడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. శోధించు, మంచి అభ్యర్థిని సాధించు అన్నట్లుగా ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా, ఎలాంటి భేషజాలకు పోకుండా విభేదాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో అన్ని రాజకీయ పార్టీలు తల మునకలై ఉన్నాయి. అయితే సరైన అభ్యర్థి ఎంపిక తో పాటు ఆయా ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు, కుల, మత, రాజకీయ సమీకరణలు, స్థానిక సమస్యలు, (త్రిబుల్ ఎం) మనీ, మద్యం, మాఫియా (మజిల్ పవర్) తదితరాలు కూడా ఆ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపద్యంలో ఆయా రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో బిజీబిజీగా ఉన్నాయి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed