ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు.పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ
Oplus_131072
సెప్టెంబర్ 4 న్యూఢిల్లీ:జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28 శాతం స్లాబ్స్ తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40శాతం పన్ను విధించాలని నిర్ణయించారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. జీఎస్టీలో రెండు స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వ్యవసాయం. వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబ్లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న ఆమె చాలా ఆహార పదార్థాలపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు.
- అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు.
- వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగింపు
- వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5శాతానికి తగ్గింపు
- చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5శాతం జీఎస్టీ
- సిమెంట్పై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు
- 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12శాతం నుంచి 0కి తగ్గింపు
- 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు
- ఫెర్టిలైజర్స్, ఎరువులపై జీఎస్టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గింపు
- పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ
- ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కాహాలిక్ బ్రేవరేజెస్పై 40 శాతం పన్ను