February 22, 2026

అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో మొదటి మూడు స్థానాలలో సత్తా చాటిన విజేత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు

0
IMG-20260218-WA0942

ఫిబ్రవరి 18 శ్రీకాళహస్తి: విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు జిల్లా స్థాయిలో తిరుపతిలో జరిగిన అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో మొదటి మూడు స్థానాలను అబాకస్ మూడు లెవెల్స్ లో, మరియు వేదిక్ మాథ్స్ మూడు లెవెల్స్ లో కూడా గెలుపొంది సత్తా చాటారు .పాఠశాల డైరెక్టర్ శ్రీ కాయం సుబ్బరామిరెడ్డి విద్యార్థులను అభినందించి వాళ్లకి సర్టిఫికెట్లను, మోమెంటోలు అందించారు. వేదిక్ మాథ్స్ కేటగిరీ లో, ఎనిమిదవ తరగతికి చెందిన ఎ.బి. డిల్లినాథ్, ఏడవ తరగతికి చెందిన ఎం.అరవింద్, ఎనిమిదవ తరగతికి చెందిన ఆర్. రిషిత శ్రీ., అబాకస్ కేటగిరీలో కె. కేతన్, కె. గగన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనందుకు ప్రిన్సిపాల్ రామ్.ఉమా సింగ్ విద్యార్థులను అభినందించి, రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలలో కూడా తమ సత్తా చాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed