స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని, అలాంటి కోవలో నవ తెలంగాణ ఒకటని ఈ సందర్భంగా అభినందించారు. “కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పత్రికలు ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేయడంలో విశేష కృషి చేశాయి. అందరికీ ఆదర్శంగా నిలబడ్డాయి. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంతో పాటు బాల్య వివాహాలు, కులాల మధ్య అంతరాలు, జోగినీ వ్యవస్థ.. వంటి సమాజంలోని అనేక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేశాయి.చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడిచే పత్రికల పాత్ర మరువలేనిది. ఇప్పుడు పాత్రికేయ రంగంలో కొన్ని వింత పోకడలు వచ్చాయి. తమ సంపాదనను కాపాడుకోవడానికి, వారిని ప్రశ్నిస్తున్న వారి పట్ల అసహ్యకర భాషను ఉపయోగించి ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సంస్థలు రావడం వల్ల జర్నలిస్టు అనే పదానికి అర్థం వెతుక్కోవలసిన దుస్థితి తలెత్తింది.జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారిపట్ల సమాజం నిశితంగా గమనించాలి. అలాంటి వారు వేరన్న విషయాన్ని అసలు సిసలైన జర్నలిస్టులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడలపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టు కూడా అదే దారిలో వేగంగా పరుగెత్తుతున్నారు.నిజమైన జర్నలిస్టులకు, ఆ ముసుగులో వస్తున్న వారికి మధ్య ఒక లక్ష్మణ రేఖను గీయాల్సిన అవసరం ఉంది. ఆ పని జరక్కపోతే పత్రికలకే కాదు, దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంది.
జూలై 31 హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు (ఎమ్మెల్సీ) మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్న “జనహిత” పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది నేటి సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభంకానున్న జనహిత పాదయాత్ర “జనహిత” పాదయాత్రలో టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి తో కలిసి పాదయాత్రలో పాల్గొననున్న ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ టిపీసీసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు పరిగి నుంచి ఖానాపూర్ వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 4వ తేదీ ఖానాపూర్ లో ముగియనున్న మొదటి విడత పాదయాత్ర. ఇప్పటికే పాదయాత్ర ప్రారంభ ప్రాంగణం కటౌట్లు, ప్లెక్సీలతో ప్రచార కార్యక్రమాలు.భారీగా తరలి వచ్చి పాదయాత్ర లో పాల్గొననున్న కాంగ్రెస్ శ్రేణులు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ ని సంస్థాగత నిర్మాణం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.
Leave a Reply
జూలై 31 హైదరాబాద్:ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు,విచారణ జరిపి ఏప్రిల్ 3న తీర్పును రిజర్వు చేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఈరోజు తీర్పు వెలువరించనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యంపై నేడు స్పష్టత రానుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యాజ్యానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.ఈ ఏడాది జనవరి 15న పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి ప్రకాశ్ గౌడ్, ఎ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ఉన్నారు.
Leave a Reply
జూలై 28:”నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”
తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట, ‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!
నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం…
అభిషేక ద్రవ్యాలు… ఫలితాలు
ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) …. దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం … పుత్ర లాభం
పుష్పోదకం… భూలాభం
బిల్వ జలం … భోగ భాగ్యాలు
నువ్వుల నూనె… అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం
సువర్ణ జలం … దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం … సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం …. శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)… ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ … శివ సాన్నిధ్యం
గంగోదకం … సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం… ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం… దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ… మంగళ ప్రదం
విభూతి…. కోటి రెట్ల ఫలితం
విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు.
సర్వేజనా సుఖినోభవంతు
@highlight
.
lordshiva
Leave a Reply
జూలై 28 న్యూ డిల్లీ: న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణం ఒక్కసారిగా ఉరుకులు పరుగులతో మార్మోగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ నేతృత్వంలో, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి SIR ప్రక్రియపై తీవ్ర నిరసన తెలిపారు. ప్రజల అభిప్రాయం లేకుండా, ఎన్నికల తర్వాత ఓటర్లను మత, కుల ప్రాతిపదికన వడపోసే ఈ ప్రయత్నాన్ని “ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర”గా వర్ణించారు. ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ ముందు స్పష్టం చేశారు: “ఇది ఓటర్లను వర్గీకరించే, ఎన్నుకున్న ప్రభుత్వాన్ని డీలా చేసే కుట్ర. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం బహిరంగంగా పోరాడతాం.ప్రియాంక గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చెప్పారు: “ఓటర్లను తీసేయడం కాదు. వారి గొంతుకను వినడమే ప్రభుత్వ బాధ్యత.ఈ నిరసన కార్యక్రమం దాదాపు గంటపాటు సాగింది. మీడియా, ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. వంశీకృష్ణ పోరాట ధోరణి, ప్రియాంక గాంధీ స్పష్టమైన నేతృత్వం కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది.ఓటరు హక్కు కోసం – పౌర హక్కు కోసం – పార్లమెంట్ గేట్ ఎదుట గళమెత్తిన గడ్డం వంశీకృష్ణ ఈ పోరాటంలో ముందు వరుసలో నిలబడ్డారు.
Leave a Reply
జూలై 28 న్యూ డిల్లీ:ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఎంపీలకు అధికార, ప్రతిపక్షాల విప్ జారీ, పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ పై నేడు కీలక చర్చ జరగబోతుంది. నేడు నుంచి 2 రోజులపాటు ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఉభయసభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరుకావాలని సూచించాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. లోక్ సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశముంది. కాగా ప్రధాని మోదీ సోమవారం సభకు వచ్చే అవకాశం ఉంది.
Leave a Reply
జులై 27 హైదరాబాద్: మనిషి తాను బతుకుతున్నాను అనుకుంటున్నాడు కానీ తన బతుకుతాను ఎలా బతుకుతున్నాడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు చాలామంది. కొంతమంది వెళుతూ వెళుతూ స్మోకింగ్ చేసుకుంటూ వెళ్తారు అది వెనుక నుంచి వచ్చే జనాలు ఎంతమంది పిలుచుతున్నారు రోగాల బారిన పడతారు అని ఆలోచన లేదు, మద్యం తాగి రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయి తెల్లారి కనీసం ఆలోచన లేకుండా తన జీవితం తానే గడుపుతుంటారు కొంతమంది. ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఏది తోస్తే చేయడం తర్వాత బాధపడడం కొంతమంది లో కనిపిస్తుంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలామంది ప్రాణాలు విడిచి పెడుతున్నారు. మన ఆలోచన మన స్థితికి కారణమవుతుంది అని చాలామంది భావించారు. నిత్యం చాలామంది ఇంటి నుంచి వెళ్లేటప్పుడు చెత్తని ఎక్కడపడితే అక్కడ పడేస్తారు ఇది ఆలోచన లేని పని. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని స్థితిలో ఉన్న మానవుడు, బ్రతికి బాధ్యత భవిష్యత్తు ఆలోచన చేసుకోవాలి. తాను చేసే పని తనకు నచ్చితే చాలు అనుకునే కొంతమంది, నలుగురికి నచ్చేలా చేయాలని ఇంకొంతమంది సరైన ఆలోచనతో ముందడుగు వేయాలి.
Leave a Reply
జూలై 27:ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మృతదేహాలు కనిపించకుండా పోయినట్లుగా వారు ఆరోపించారు. ఇందులో లక్ష్మీప్రియ బెహెరా, సత్యభామ పరిడా, శత్రుఘ్న దాస్, ప్రమీలా దాస్ మృతదేహాలు ఉన్నాయని సమాచారం.చేతబడుల కోసం వాడుతున్నారా?ఈ సంఘటనల వెనుక అక్రమంగా అవయవాలను సేకరించి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సరఫరా చేసే ముఠా ప్రమేయం ఉండవచ్చునని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ మృతదేహాలను చేతబడుల కోసం తీసుకెళ్తున్నారని కూడా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనల వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిపూట శ్మశానవాటిక వైపు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు.
ఇంతకు ముందు కూడా పలు ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.శ్మశానవాటికలో ఖననం చేయబడిన 10 రోజుల తర్వాత నా తల్లి మృతదేహం కనిపించడం లేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని స్థానికుడు తపస్ సమల్ అన్నారు. తాజాగా మరో నాలుగు మృతదేహాలు కనిపించకుండా పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టిస్తోంది.
Leave a Reply
జూలై 25 హైదరాబాద్: వరంగల్ ప్రాంత దిశదశను మార్చేసే మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగా… అందుకు కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకి… రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు. గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తాము జిల్లా ఇంఛార్జీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృషి చేస్తున్నట్టు వివరించారు. కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా మామునూరు ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు. సుమారు 1,000 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టు పూర్తయితే, మామునూరు విమానాశ్రయం ప్రారంభమైతే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లే రహదారుల వెంట అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సురేఖ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కూడా పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.
Leave a Reply
జూలై 25 మహేశ్వరం: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఎన్.రామచందర్ రావు తొలిసారి మహేశ్వరం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా *మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందెల శ్రీరాములు. జూలై 25 న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ తో కలిసి *తెలంగాణ బిజెపి చీఫ్ ఎన్.రామచందర్ రావు కి ఘన స్వాగతం పలికారు. సందర్భంగా నిర్వహించినటువంటి పత్రిక సమావేశంలో *ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పేరుతో ముస్లింలకు కేటాయిస్తున్న రిజర్వేషన్ ఎత్తివేస్తే బిజెపికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని అలాగే జడ్పీ చైర్ పర్సన్ ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం *బిజెపి కిసాన్ మోర్చా ఏపీఎంసీ కన్వీనర్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏనుగు రామ్ రెడ్డి నూతనంగా నిర్మించినటువంటి ఏ.ఆర్.ఆర్ రిసార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు గారు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సుధాకర్ శర్మ, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా సభ్యులు పాపయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి, కడారి జంగయ్య యాదవ్, కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు వీరకర్ణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, డివిజన్ అధ్యక్షులు, యువ మోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకురాలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.